STORYMIRROR

harish thati

Others

4  

harish thati

Others

తొలివలపు

తొలివలపు

1 min
285

పల్లవి:


నింగిన మెరిసే తారకవో

నన్నే తాకిన మెరుపువో

నాపై కురిసే చినుకువో

వెలుగు పంచే వెన్నలవో నా బ్రతుకునా

ఎవరో ఎవరో ఇంతకీ నాకు నీవేవరో

జన్మంత జతగా నడిచే చెలి జానకివో ౹౹2౹౹


చరణం(1):


చుట్టూరా ఎందరు ఉన్న

నీ తలపులలో జతనై ఉన్నా

ఒంటరిగా కనిపిస్తూ ఉన్న

నీ శ్వాసనై నీతోనే ఉన్నా

గమ్యమేది లేదని అన్న

నీ అడుగుల్లో అడుగై ఉన్నా

నీవెక్కడని అడిగేస్తూ ఉన్న

నీ చిరునవ్వే చిరునామై ఉన్నా

మదిలో అల్లరి రాగం మొదలయ్యెను ఈవేళే 

ఎదలో వలపు వర్షం కురిసెను నీవల్లే  ౹౹ఎవరో౹౹


చరణం(2):


కురిపించవా మాటల వాన

నీ మౌనం విడిచి నాపైనా 

వాలుకళ్ళ చూపుల తోన

నీ ప్రేమను పంచు కాస్తైనా

తెలియని సంతోషం లోన

నీ వలనే కలిగే ఓమైనా

మంత్రమేదో వేసావా మీన

నీ మైకంలో మునిగా ఏమైనా 

అందాల అపరంజి బొమ్మ నాకు అర్ధాంగివై రావమ్మ

వలపు విల్లును విరిసి నిన్ను మనువాడే శ్రీహరినమ్మ ౹౹ఎవరో౹౹

      .   @హరాక్షర 3074@



Rate this content
Log in