STORYMIRROR

harish thati

Abstract Classics Others

4  

harish thati

Abstract Classics Others

ఆన ముసురు

ఆన ముసురు

1 min
235

మొన్నటి దాకా రోకళ్ళు వల్గే ఎండలతో ఉక్కిరబిక్కిరయ్యే పానాలు....

ఇగ గిప్పుడు మొగులు మొత్తం మూసుకొచ్చింది

మబ్బు కండోలై ఎర్రడాలు వడి మెత్తబడింది

ఒక్కో సినుకు సిటుకు సిటుకు మన్కుంటా

పొక్కిలి నేలను ముద్దాడుకుంటా చిందేస్తుంది

గా సినుకు చిందులకు భూమి మట్టిగంధపు అత్తరు కొట్టవట్టే!.

ఇగ తప్పెఆన పోటుకు రాలుకుంటా సాన్పి జల్లవట్టే!.

మీదికెళ్ళి కింది దాకా ఎగ్దారిఆన శేర్లు దిక్కుంటా సిన్న సిన్నంగా షురువైంది.

 నేలతల్లికి బగ్గ దూపైందేమో!. పడ్డ సినికు పడ్డట్టే ఇట్టే ఇంకివోతాంది

మూడోద్దుల సంది గింత గూడ గెరువియ్యకుంటా!.

కుండలతోని కుమ్మరించినట్టే ముసురు వాన కొట్టవట్టే!.

మొదటి ఆన సెల్కలను సాలువానతోనే తడిపి పోద్దనుకుంటే!.

ఇరువాలు వాన ఇరుగ గొట్టి సాలుపెట్టుకు సరిపెట్టుకుంటా సిత్తు సిత్తుగా కురువబట్టే!...

ఇగ గిట్ల ఇరాము లేక కురుసుకుంటా

మట్టి మిద్దెలను తడిపి ముద్ద సేసింది.

గూన పెంకుల ఇండ్ల మీద గోళెంలు దెచ్చి గుమ్మరించిన్నట్టే 

 పెంకల సూర్ల నుండి కారుకుంటా ఇళ్లంతా ఊర్వబట్టే!..

 ఊర్సిన కాడల్ల ఉన్న బువ్వగిన్నెలు సదురుడే సరిపాయే

 సేతాడు బాయి నుంచి చేతులతో చెంబుల ముంచి నీళ్ళు మొఖాలను కడగవట్టే 

 అద్దొద్దన్న సిన్న పోరగండ్లు నెత్తిన అర్కుసంచి కోలాటం తోని కాగిలపు పడవల ఆటలాడుతుండ్రు 

 ఉన్న బర్లు,గొడ్లు గీ సినుకులకు కాడు దప్పుకపోవట్టే

 సెట్టు సిటారు కొమ్మన కట్టుకున్న సక్కని గూడు తడిసి బిక్కు బిక్కుమంటూ వణుక్కుంటా పిట్ట రెక్కల్ని అరబెట్టుకుంటా సంబరవడి మురవబట్టే

 గీ ఆనతో నాల్గు గింజలు దొర్కి పొట్టతిప్పలుండవని కాలం గావలని గా దేవునికి మొరవెట్టుకుంటుంది.

 ఊర్ల ఒర్రెలు,కుంటలు, ఎగవడి పారుకుంటా వాగు, వంకలు పొర్లి పొలిమేరను దాటనిత్తలేవాయే 

 మట్టిల నాటిన విత్తుకు పానమొచ్చి భూమి పొరలను పొడుచుకువచ్చి చిట్టి చిట్టి చిగురులేస్తుంది

 చెరువుల నీళ్లు అలుగు వారి మత్తడి దూక్కుంటా

 సెల్కలల్ల సేరి సాపలతో ఎదురెక్కుతుండే 

 పొతం సేసి అల్కిన నారు పోలంల దొయ్యలు నిండి మొలక నారు మునుగుతుండే

 పైకి లేచిన గడ్డి పరక మీద సినుకులు ముత్యాల కిరీటాన్ని వెట్టే!..

 ఆల్ష్యమైన గీ ఆన కాలం మంచిగై అన్నదాతను ఆదుకుంటే అంతే సాలు!..

 

 హరాక్షర3074✍️


Rate this content
Log in

Similar telugu poem from Abstract