రగిలే అగ్నిశిఖ ఆమె
రగిలే అగ్నిశిఖ ఆమె
అమృతత్వాన్ని పంచగా సృష్ఠి చేసే మాతృమూర్తి
మానవ జాతికి వెలుగులు నింపే ఆమె స్ఫూర్తి
మధురమైన మమకారపు మాధుర్య భావాల జ్ఞాపిక
ఆమె అవమానపు అపజయాలకు ప్రేరణల ప్రతీక
కట్టుబాట్ల సంకెళ్లను సహనంతో తుంచేసే చైతన్య దీపిక
సంకల్ప దీక్షతో సాగుతూ,సమరాల వేదికపై ,సాహసాల వేడుక చేస్తుంది.
తన మేధస్సు అబ్బురపరిచే ఆవిష్కరణల సమూహం
ఆమె రౌద్రం దుష్టుల రుధిరంతో శాంతించే కరావలం
వినమ్రత, విధేయతతో, విశ్వాసాన్ని నింపగా విశాల విశ్వాన రగిలే అగ్నిశిఖ
పుడమి పుట్టుక నుండి పూజలందుకుంటున్న ఆదిశక్తి
ఎవరి ఊహకు కూడా అందనిది ఆమెలోని అనంత యుక్తి
ఆమె!..వేల కోటి వేదన తరంగాలను దాచుకున్న నిశబ్ద కడలి
అణిచివేతతో మనసు ముక్కలైన!...
ఒంటరిగా ఓర్పుతో నేర్పుగా నిలిచి గెలిచే వీరనారి!...మగువా!...
- హరాక్షర 3074
