ఆమె మాటాడింది
ఆమె మాటాడింది
1 min
266
గీ యాళ్ళ నా కళ్ళల్లోకి ఆమె ఎందుకనో ఇట్టా తొంగి సూసి
కనుసైగలతో ముచ్చటాడి కనుపాపకు శానా నవ్వుల్ని పంచింది
తన వాలు చూపులతోని నా కళ్ళల్ల తన రూపు ముద్దరేసి ఎళ్ళిపోయింది
గప్పటి నుండి తన తలపులతో ఇగ తనువంతా పొలమారుతూనే ఉంది
నా మన్సేమా నీ ఎంట పసిపిల్లోలే పరిగెత్తుకుంటూ వొచ్చే
ఇప్పుడు నేనేమి సేసేది? సిన్ని!
@హరాక్షర 3074✍️
