నీ ఒడి వాలగ
నీ ఒడి వాలగ
పూలను పాన్పుగ..పరచుట దేనికి..!?
నీ ఒడి వాలగ..జంకుట దేనికి..!?
వెన్నెల వానన..చేరుట దేనికి..!?
నీ నవ్వులు నే..మరచుట దేనికి..!?
పాటల మధువును..త్రాగుట దేనికి..!?
నీ చూపులు నే..దాటుట దేనికి..!?
నాలో నేనే.. మరుగుట దేనికి..!?
విరహపు గరళము..మోయుట దేనికి..!?
మనసును నీకే..ఇచ్చుట దేనికి..!?
అమాయికతనే..వీడుట దేనికి..!?

