దేవులాడుతున్నా
దేవులాడుతున్నా
వెలుతురులో చీకటిని
చీకటిలో మిణుగురులని
కంటి పాపల్లో కలవరమును
పెదవి కొసల్లో నవ్వులను
నడిచే మార్గమును
తలిచే దైవమును
నడిపే సారథిని
చూపేదెవ్వరని
వర్షపు నీటిలో
జ్ఞాపకాలు కరిగెనా
వసంతాలు కుండీల్లోని కంపోస్టులా మారినా
ఇంకా బతుకున్నదని
తెలివిగా తప్పించుకునే జాడ కనిపించేలా
మనసు మళ్లీ ప్రేమ పాట పాడేలా
తోవ తెలిపే గురువెక్కడ
ప్రకృతినే కౌగిలించు నా దేహం
సాంగత్యపు వివరాలు పట్టించుకోని ఓ మైకం
ఆకుల్లోని పత్రహరితంలా
నిండిపోయిన ప్రేమ భావం
కరుణించి కరిగించే
ఆ వెలుగుల సూరీడు
కావాల్సిన ఆ గురువు
ఎక్కడ
ఎక్కడని దేవులాడుతున్నా
కనిపించేంతవరకూ
లోకాన్ని కాదంటూనే ఉంటా
