కరగవే మేఘమా.....
కరగవే మేఘమా.....


నిన్నొ మొన్నో నువ్వు నేను కలసి నడిచిన ఆ దారుల్లో....
అల్లుకుపోయిన జత అడుగులు!
నీకు నాకు మధ్య జరిగిందేమిటో తెలియక మౌనంగా రోధిస్తున్నాయి....
ఆశల సంద్రానికి అవతల నువ్వు ఇవతల నేను మన అడుగులు కలవక ఎన్నాళ్ళయిందో.....
నింగి నేల ప్రత్యక్ష సాక్ష్యాలుగా నువ్వు నేను చేసుకున్న బాసలు!
నిజమో అబద్ధమో తెలియని వెర్రిమనసులు
నువ్వు నేను మాత్రమే నిజమని నమ్మి సాగిన రోజులు
నన్నే చూస్తూ ........
నువ్వు నన్ను కాదన్నాక!
నమ్మకానికి ఏ భాష ప్రామాణికమో తెలియక!
నిశ్శబ్ద ద్వనిలో నిన్నటి మాటలు అన్ని నువ్వోడిపోయావని నలుదిక్కులు చేరి నవ్వుతుంటే......
దోషివి నువ్వో నేనో అర్థం కాని సంఘర్షణలో......
మనసంతా మూగబోయి..... హృదయపు గదుల్లో గూడు కట్టుకున్న దుఃఖమంతా గంగా ప్రవాహాలై పొంగిపొర్లుతుంటే.....
కన్నీటిని చూసి కవ్వించే మనిషులని తలచి!
మేఘానికి లంచం ఇచ్చాను!
ఒక్కసారి వర్షించమని ఆ జల్లులలో తనివితీరా ఏడవాలని!