నువ్వు..నిన్నటి నేను..
నువ్వు..నిన్నటి నేను..
సమయంతో పోటీపడి
చాటుగా తనను కలవాలని
నా వృత్తిని
గౌరవాన్ని
పక్కన పెట్టి వెళ్ళాను
అరికాళ్ళ దగ్గర కూర్చొని
అడుక్కుంటూ బ్రతిమిలాడాను
తను చీదరించుకుంటున్నా అదీ ప్రేమలో భాగమనుకున్నా
ఇవాళ నిన్ను చూస్తుంటే
అచ్చం నాలానే ప్రవర్తిస్తున్నావ్
నువ్వు నిన్నటి నేనులా అనిపించావ్
నేనిచ్చే సలహా ఒకటేరా బాబూ
తొందరగా పారిపో
చాలా ఏడుస్తావ్
కన్నీరు ఇంకిపోయేంతలా ఏడుస్తావ్
అందుకే
ప్రేమకు దూరంగా పారిపో..