కరిగింది జీవితం....
కరిగింది జీవితం....
కరిగింది జీవితం....
ఇది కాదన లేని వాస్తవం
కోరికల తీరంలో ....
కొట్టుకొని అలసింది ప్రాణం
కలతచెంది ఆలపిస్తున్న...
ఆలకించి కాపాడవా....కృష్ణయ్య
కాటిన్యమేలయ కాపాడగా రావయ్యా
రారా.. కృష్ణయ్య రారా.. కృష్ణయ్య
కాదనలేని సత్యము నీవయ్యా
నివే దిక్కయ్య నీవు లేక నే ఉండలేనయ్యా
రారా.. కృష్ణయ్య రారా.. కృష్ణయ్య
రారా.. కృష్ణయ్య రారా.. కృష్ణయ్య
కపట వేషధారులా... కల్పితమైన పాత్రల మధ్యన..
కన్న ప్రేమలు లేవు... కట్టుకున్న భార్య లేక ఒంటరినయ్యాను
కడుపున దాచానుబాధలెన్నో ... అయినా నిన్నే మొక్కాను ..
కలిసిరాని కాలానా... .. మరెన్నోకష్టాలనె పెట్టావు
కటిక దారిద్రంలోనూ... నే పూజలు ఎన్నో చేశానయ్యా...
కనిపించని తీరానికై... కట్టుబాట్లతో నడిచానయ్యా
కాటిన్యమేలయ కాపాడగా రావయ్యా
రారా.. కృష్ణయ్య రారా.. కృష్ణయ్య
కాదనలేని సత్యము నీవయ్యా
నివే దిక్కయ్య నీవు లేక నే ఉండలేనయ్యా
కమలజాండమున్నంతయు... వ్యాపించి ఉన్న ఓ ..కృష్ణ !!
కలలను ఎన్నో కన్నాను... కానలో మృగాలతొ బ్రతికాను
కనకరించని మనసుతో...కన్నీటి నావలో గడిపాను......
కాటికి చేరే ఈ సమయాన... నా తప్పు లేంచకు!!
కరములను జోడించి.... మ్రొక్కి ముక్కి ఏడ్చానయ్యా...
కనిపెట్టి కాపాడుకోవయ్య.. కరుణించి దరి చేర్చుకోవయ్యా...
కాటిన్యమేలయ కాపాడగా రావయ్యా
రారా.. కృష్ణయ్య రారా.. కృష్ణయ్య
కాదనలేని సత్యము నీవయ్యా
నివే దిక్కయ్య నీవు లేక నే.. ఉండలేనయ్యా
రారా.. కృష్ణయ్య రారా.. కృష్ణయ్య
రారా.. కృష్ణయ్య రారా.. కృష్ణయ్య
మోక్షాన్ని ప్రసాదించరామయ్య..
రారా.. కృష్ణయ్య................
