"నా" పదం వెనుక నిగూఢంగా దాగి ఉన్నవాడా !ఈ చిన్న విన్నపము వినుము!!
"నా" పదం వెనుక నిగూఢంగా దాగి ఉన్నవాడా !ఈ చిన్న విన్నపము వినుము!!
"నా" పదం వెనుక నిగూఢంగా దాగి ఉన్నవాడా !
"మనం" అను పదం లో బహుముఖంగా గోచరించువాడా!
శరణు ప్రభో... శరణు..శరణు.. నిరాకార!.. దయాసాగరా!!
"నీది" అగు "ఆత్మ" కొరకు ఆరాటంతో మొదలైన ఆటలో...
"నాది" అగు "కర్మల" పోరాటం తో ఇరుకున పడిన వాడి నై...
ఈ చిన్న విన్నపము వినుము సత్ పురుషోత్తమా!!
నా సహజలక్షణము పాప కర్మలు చేయుట ఈ మాయా లోకంలో...అయినా..
నీ సహజలక్షణము మరువకు మరువకు సదా నన్ను కాపాడుటలో...!!
"నా" పదం వెనుక నిగూఢంగా దాగి ఉన్నవాడా !
శరణు ప్రభో... శరణు..శరణు.. నిరాకార!.. దయాసాగరా!!
ఈ సృష్టి ఎప్పుడు మొదలైందో నాకు తెలియదులే ..
ఈ సృష్టి ఎప్పుడు అంతమగునో నాకు తెలియదు లే ... అయినా..
ఈ చిన్న విన్నపము వినుము జన్మ మరణాలులేనివాడా !!
ఈ జన్మ ఎప్పుడు మొదలై.. అంతమగును నేను ఎరిగినది కాదులే.. అయినా.. ..
ఈ జన్మ మరణ చక్రం నుండి రక్షించు వాడవు నీవే అని ఎరుగుదులే!!
"నా" పదం వెనుక నిగూఢంగా దాగి ఉన్నవాడా !
శరణు ప్రభో... శరణు..శరణు.. నిరాకార!.. దయాసాగరా!!
ఈ దుఃఖముల చేత భయభ్రాంతుడనె అడుగుట లేదులే స్వామి...
నీ దగ్గర శాశ్వత సుఖం కొరకు.. అడుగుట లేదులే తండ్రి... అయినా..
ఈ చిన్న విన్నపము వినుము "నువ్వే- నేను" అయినవాడా!!
నా ప్రభువు అయినా నిన్ను విడిచి ఇక్కడికి వచ్చితిని స్వామీ....
మనము అను పదంతోో "నీలో" లీనం అవ్వాలనే అడుగుతున్నా తండ్రి!!
"నా" పదం వెనుక నిగూఢంగా దాగి ఉన్నవాడా !
"మనం" అను పదం లో బహుముఖంగా గోచరించువాడా!
శరణు ప్రభో... శరణు..శరణు.. నిరాకార!.. దయాసాగరా!!
భావన: "నా" అను అహంభావంతో పరమాత్ముని గ్రహించుట అసంభవం.
"నా "అను పదాన్ని విడిచిన వెంటనే పరమాత్మ స్వభావం కనబడను.
అందుకే "నా" పదం వెనుక నిగూఢంగా ఉన్న వాడు అని చెప్పడం జరిగినది.
"నా" పదాన్ని విడిచి తనలో విలీనం అవ్వాలని కోరడం జరిగినది.