STORYMIRROR

Premakishore Tirampuram

Inspirational

4  

Premakishore Tirampuram

Inspirational

గురువు ఒక రూపం కాదు – అనుభవాల దర్శనం

గురువు ఒక రూపం కాదు – అనుభవాల దర్శనం

1 min
13

************

గురువు ఒక రూపం కాదు –  అనుభవాల దర్శనం

కాలమే గురువు – పాఠాలు చెప్పే గొప్ప దిక్సూచి,

ప్రతి క్షణం ఓ పాఠం – జీవితాన్ని తీర్చిదిద్దే శిల్పి.

ఒక్కో అనుభవం – ఒక శిక్షణ,

ఒక్కో బాధ – ఒక బోధన.


మనతో మాట్లాడిన ప్రతి వ్యక్తి –

వారి మాటల్లో మౌలిక జ్ఞానం.

ఎదురు వచ్చిన ప్రతి అనుభవం –

మన బుద్ధిని వెలిగించే విద్యాసాగరం.


బడి, గుడి, అమ్మవడీ మనకు

ముఖ్య తరగతులు .

ముందుగానే మెరిసే వెలుగులా,

మన మొదటి గురువులు అమ్మానాన్నలా.

ఒక్కో మాట, ఒక్కో చూపు మార్గదర్శకమవుతుంది.


నిరాశ చూపిన పరిస్థితిదేదయినా,

ఆ బాధే మమ్మల్ని తారసపడే శక్తిగా మార్చుతుంది.

తప్పుల్ని చూపే దారులూ గురువులే,

తలవంచే విలువలు నేర్పే మహానుభావులే


ఈ గురుపౌర్ణమి రోజున –" వ్యాస మహర్షి వారిని తలుచుకుంటూ"

అందరినీ గౌరవిద్దాం,

ప్రతి సుగుణాన్ని నేర్చుకుందాం,

ప్రపంచాన్నే ఓ విశ్వవిద్యాలయంగా చూస్తూ

గురువులందరికి మనఃపూర్వక వందనాలు చెల్లించుదాం.


గురుపౌర్ణమి శుభాకాంక్షలు!

అందరూ మన జీవన గురువులే!


మీ Prem Kishore 

******************


Rate this content
Log in

Similar telugu poem from Inspirational