స్క్రీన్ వైపు చూపులు
స్క్రీన్ వైపు చూపులు
నిద్రనుండి లేచామా
ఫోన్ చూడాలి
బాత్రూం కి వెళ్ళినా
ఫోన్ తీసుకెళ్లాలి
తినేటప్పుడు
మాట్లాడేటప్పుడు
నిద్రపోయే ముందు
స్మార్ట్ ఫోన్ స్క్రీన్ వైపు చూసీ చూసీ
కళ్ళ మంటలు
కళ్ళ నొప్పులు
అయినా ఆపం
మళ్ళీ స్క్రీన్ చూస్తూనే ఉంటాం
కొత్తగా కంప్లైంట్స్ చేస్తూ ఉంటాం
స్క్రీన్ వైపు చూపులు
ఆపడం నేర్చుకోవాలి
