ఓం నమః అమ్మ!!
ఓం నమః అమ్మ!!
ఆ మనోజ్ఞ రూపం ఓ దీవెనల నిధిగా,
ఆ దివ్యమైన కళ్ళల్లో ప్రపంచమే జీవించగా,
ఆమె సన్నిధిలో ప్రశాంతత నిండుగ వ్యాపించగా,
అన్ని కష్టాలు తీర్చే ఓ నిస్వార్థ దేవిగా,
మన చుట్టు నడిచే ఓ గొప్ప దేవత, అమ్మ!!
నీ శ్వాసని పంచి సంతతిని పెంచావే,
నీ సృష్టిలే నీకు ప్రపంచముగ మిగులుగా,
వీళ్ల సంతోషాన్ని కళ్లల్లో నిండుగా చూస్యావే,
నీ గుండె చప్పుడంతా వీళ్ల పలుకలు వింటావ్,
>
ఆ దేవుడే నీలో నివసిస్తున్నాడే, అమ్మ!!
నీ పవిత్ర గర్భగుడిలో పసికూసని రక్షించావ్,
వీళ్ల జీవితకాలాన్ని నీ గుండెల్లో బద్రించావే,
చల్లనైన నీ వడిలో మాకు దిగులు ఉండేనా,
అమ్మ నీ సృష్టితో ప్రపంచమంతా ధన్యమే,
నీ అదృశ్యంతో ప్రపంచం శూన్యమే, అమ్మ!!
నీ కళ్లల్లో శ్రీహరి, నీ వడిలో శ్రీహరి,
నీ గుండెల్లో శ్రీహరి, నువ్వే మా పాలికి శ్రీహరి!!