శుభ కానుక
శుభ కానుక
ప్రవహించే చల్లని గాలిలో,
నీ మధుర జ్ఞాపకాల వరంలో,
పులకిస్తున్నది నా హృదయాల భావనలు,
ఉప్పొంగి పెరుగుతున్నది నా సంబరాల అలలు!!
నీ ఉహల సమక్షంలో,
మళ్ళి జన్మిస్తున్నది నా ప్రాణం,
నీ ఊపిరి అనుభూతిలో,
జీవిస్తున్నది నా జీవిత తరం!!
నీతో గడిచే ఈ సమయం,
నేను కోరుకున్న ఓ గొప్ప అనుగ్రహం,
నీతో నడిచే ఈ మార్గం,
నేను ఆచరించే ఓ దివ్యమైన ఉత్సవం!!
కురిపించే నీ క్షణాల వర్షంలో,
ఎప్పటికి తడవాలనే ఓ కోరిక,
నాకని దర్శించే ఓ దేవత,
నీతో గడిపే ఈ జీవితమే ఓ శుభ కానుక!!