కరోనా మనకు శత్రువు అనుకున్నా..కానీ
కరోనా మనకు శత్రువు అనుకున్నా..కానీ
నేడే తెలిసింది...
స్వేచ్ఛ ఎంత విలువైనదో!
ఎపుడు పడితే అపుడు
ఎక్కడికంటే అక్కడికి
పిచ్చా పాటి కబుర్లకి
ఏ మాత్రం జాగ్రత్త లేని
తిరుగుళ్ళు తిరిగినప్పుడు
తెలియలేదు.. స్వేచ్ఛ ఎంత విలువైనదో!
నేడే తెలిసింది..
కుటుంబం అంటే ఏమిటో!
ఆఫీసు పనులు..బయట పనులు
ఫ్రెండ్స్ తో పార్టీలు..లేట్ నైట్ లు..అంటూ
ఇంట్లో వాళ్ళని నిర్లక్ష్యం చేసినపడు
తెలియలేదు...
కుటుంబమెంత ఆత్మీయమైనదో!
నేడే తెలిసింది...
అమ్మ చేతి వంట ఎంత ఆరోగ్యమైనదో!
టీ లు.. టిఫిన్ లు..
ఫిజ్జాలు.. బర్గర్ లు..
కబాబ్ లు... బిర్యానీ లు
ఐస్క్రీం లు.. మిల్క్ షేక్ లు
అంటూ.. నాన గడ్డి తిన్నపుడు
తెలియలేదు..
అమ్మ చేతి వంటలో కమ్మదనం!
నేడే తెలిసింది...
డబ్బెంత విలువైనదో?
రయ్ రయ్ మని బైక్ లు
షాపింగ్ లు.. రక రకాల ట్రిప్ లు
వీకెండ్ పార్టీ లు...అంటూ!
లెక్కా పద్దు లేకుండా
ఖర్చు పెట్టినప్పుడు తెలియలేదు...
రూపాయి ఎంత విలువైందో!
ఇలా మన జీవితం లో
నిజంగా విలువైనవి ఏంటో..
తెలియజేసిన కరోనా..
మనకు శత్రువా?
సృష్టి లో...
ప్రతి జీవి తన మనుగడ
ఎక్కడ సాధ్యమో..అక్కడే సంచరిస్తుంది
పాపం!కరోనా మాత్రం ఏం చేస్తుంది?
దాని వూపిరి మన ఊపిరితిత్తుల్లో నే..
తన మనుగడకోసం సంచరించే..
కరోనా మనకు శత్రువెలా?
ఎంతమంది ఎన్ని విధాలుగా చెప్పినా
నిర్లక్ష్యం వహించమనే...
మన మనసే... మనకు పేద్ద శత్రువు!
........ రాజ్.....