కలాం జీ నీకిదే నా సలాం👃
కలాం జీ నీకిదే నా సలాం👃


కలాంజీ....!! నీవొక జ్ఞాన క్షిపణివి
కలల దార్శకుడవు నీవు...
భారతజాతి రత్నానివి...
రేపటి పౌరుల ఆదర్శ స్వప్నానివి
విద్యార్థి లోకానికి స్ఫూర్తివి నీవు
వినీలకాశంలో అగ్నిధ్రువానివి
అలుపెరుగని నిత్య ఉపాధ్యాయుడా..!!
అమరలోకాల్లో బోధనోన్నతిపై
మా అందరిని వదిలి వెళ్ళావా...??
మిమ్మల్ని అందుకోవాలనే లక్ష్యంతో
మీ దారుల్లో పయనించాలని
నిత్యం కలలు కంటూ వాటిని
సాధన చేస్తూ నీ దారుల్లో సాగిపోతాం...!!