కాలంతో దోస్తీ..
కాలంతో దోస్తీ..


పరుగు పందెం జీవితం
నిరంతర సమరం బ్రతుకు
ఆశతో నడుస్తూ శక్తి మేరకు శ్రమిస్తూ
ఆగక సాగితేనే చేరుతాము గమ్యం
కరిగిపోయే కాలంలో
తరిగిపోయే సత్తువతో
పెరిగిపోయే ఈడుతో
కాలంతో దోస్తీ చేస్తూ
కంప్యూటర్ యుగంలో
క్షణ క్షణం పరుగు
మరుక్షణం మార్పు
కొత్తదనం జీర్ణించుకుంటూ
సాగుతున్న పయనమిది
సాహోరె జీవితం.......