బహుశా
బహుశా


జుట్టుకు రంగేసి వయసు దాచేయాలనో
టీ షర్ట్ వేసుకుని తిరిగితే వయసు తక్కువ కనిపిస్తుందనో
అనుకునే వ్యక్తి కాదు కానీ
అరవై ఏళ్ళు వచ్చినా ఒక యువకుడిలో
ఉండే ఒక కార్య దీక్ష
పట్టుదల ఇంకా శక్తి సామర్థ్యాలు
అవేవీ అతడిని వీడి పోలేదు
బహుశా క్రమశిక్షణ ఫలితం కాబోలు
అతను జీవించడం మానలేదు
బహుశా అతనింకా ప్రేమించడం మానలేదు కాబోలు