శూన్యం
శూన్యం
ఎప్పుడో పారేసుకున్న ఆ నవ్వుల్ని ఏరుకొందామని
ఎద మొత్తం శోధించినా శూన్యమే చేతికి తగిలింది
గతకాలపు జ్ఞాపకాలు ఘనీభవించి ఏమి మిగలనీ
వింత అనుభూతి వెక్కిరించి ఏమార్పుని పెంచింది
శూన్యంలోనుంచి వచ్చిన నీకు శూన్యమేగా మోక్షం
కాలం సాగుతూనే ఉంటుంది నీ కాలాన్ని కొలుస్తూ
ఆ జాలంలో చిక్కి ఉనికి కోల్పోతావు ఏదో తలస్తూ
శతాబ్దాలు యుగాలుగా తెలియని అదో రహస్యం
కాదన్నా వద్దన్నా కబళించి విధి చే
సే వింత హాస్యం
వృద్యాప్యమే కనులు ముందే కన్పించే ప్రబలసాక్షం
ఈ సృష్టిలో పుట్టుక గమనమే తెలియని ఆగమనం
గమ్యాన్ని నిర్దేశిస్తూ పోగొట్టుకోలేవా ఏమీ లేనితనం
రహస్యాన్ని చేదిస్తూ నిరూపించలేవా నీ గొప్పతనం
ఏదో సాధించావని సంపాదించావని అలా విర్రవీగకే
ఏమిలేదని రిక్త హస్తాలతో తిరిగి శూన్యంలోకి వెళ్ళే మనిషే మరి నిదర్శనం
అపరిచితుడువే ఈ లోకంలో అన్న నిజమేదైన్యం
పరిచిత నివాసం ప్రబలమై తెలసికొన నీకదిశూన్యం