మార్గదర్శి
మార్గదర్శి


తను వదలివేశాడు
ఎవరేమంటారో అనే ఆలోచనని
తను మానేశాడు
నలుగురికీ నచ్చేలా బ్రతకడం
తను పట్టించుకోలేదు
తనని తక్కువ చేసి మాట్లాడేవారిని
తను మార్చుకున్నాడు
తన పంథాని జన ప్రీతీ నుంచి స్వప్రీతి వైపు
తను మలచుకున్నాడు
తన ఆలోచనల్ని తన అభివృద్ధి కొరకు
తను గెలుపొందాడు
తనని తాను
ఒకప్పుడు అందరికీ అపరిచితుడు
ఈ రోజు మరెందరికో మార్గదర్శిగా నిలిచాడు