నాలో నేను
నాలో నేను
రుధిర ప్రశ్నల సారం మది నిండా కప్పుకున్నా....
వేవేల వర్ణాల హరివిల్లు లను ప్రతి కలలో చూస్తున్నా..
ఎవరు లేని ఏకంతాన ఒంటరి జీవితాన్ని ఆనందంగా ఆస్వాదిస్తున్నా..
నాలో గల కొత్త మనిషికై అన్వేషిస్తున్నా...
నిరంతర సాధన చేస్తూనే కొత్త నవ్వులని పూయిస్తున్నా..
అందరూ వున్నా ముందు నిలవకున్నా నా లో గల దైర్యం గెలవాలి అనే తపన ఉరకలు వేస్తుంది...
ఎప్పుడు ఒంటరి కాదు నీతో నేను వున్నాను నీలో నేనున్నాను...అని చెప్పే అంతరాత్మ... నాలో నేను అంటుంది..