ప్రకృతి
ప్రకృతి
ప్రకృతిమాత తనప్రేమను..దాచలేదు ఎక్కడా..!
ఆ దైవం తాను విడిగ..ఉండలేదు ఎక్కడా..!
మౌనములో మౌనముతో..కూడుటయే తెలిసెనా..
పదునన్నది మాటలకే..అంటలేదు ఎక్కడా..!
చెలిమి కోరు మనసుకన్న..దేవళమే లేదుగా..
ఆత్మీయత ధనమైతే..మంటలేదు ఎక్కడా..!
పలుకుతేనె పంచగల్గు..హృదయమెవరి సొంతమో..
అమ్మజోల మించి అసలు..పాటలేదు ఎక్కడా..!
ఏమి నేర్చుకోగలమో..కళాశాల చదువులో..
సంస్కారం పండించే..విద్యలేదు ఎక్కడా..!
