హోలీ
హోలీ
పలుకోర్కెల రంగులెల్ల..రాలితేనే హోలీ..!
వింతమాయ పట్టుసరిగ..తొలగితేనే హోలీ..!
కమ్ముకునే సిగ్గుతెరల..దొంతరలో అలజడే..
చెమ్మకేళీ విలాసాలవి..నవ్వితేనే హోలీ..!
రాగతాళ గతులేవో..శృతినికోరు ముచ్చటే..
సృజనాత్మక చైతన్యం..వెలిగితేనే హోలీ..!
ఉన్మాదం రేపుతున్న..కలకలమది ఏమిటో..
పెచ్చుమీరు సమరవాంఛ..పేలితేనే హోలీ..!
విజ్ఞానపు వెర్రితలల..వ్యామోహం దేనికో..
దివ్యజ్ఞాన ప్రకాశమది..జరిగితేనే హోలీ..!
శాంతిమంత్ర పాఠంతో..యుద్ధాలే ఆగునా..
దురాక్రమణ దుర్బుద్ధిని..దునిమితేనే హోలీ..!
