STORYMIRROR

Midhun babu

Classics Inspirational Others

4  

Midhun babu

Classics Inspirational Others

నిత్యసత్య

నిత్యసత్య

1 min
9

భువనమ్ముల కరుణమేఘ వర్షాలను ఆపలేము..!

మనుజజన్మ కోరుకునే భోగాలను ఆపలేము..!


లేదు వాన..కాలుష్యపు తాండవాన మునిగినాము..

చెలరేగే ఉత్పాతపు తాపాలను ఆపలేము..!


మందులనే ప్రేమిస్తూ మంచంలో పడిఉంటే..

పోటెత్తే భీకరమౌ..రోగాలను ఆపలేము..!


మాంసమునే భుజియిస్తూ హింస ఎలా చేస్తారో..

తమకు తాము చేసుకునే పాపాలను ఆపలేము..!


జీవకోటి సర్వములో..దైవముంది సత్యము కద..!

జీవహింస పాపమనే వేదాలను ఆపలేము..!


నిత్యసత్య సూత్రమంటె..ప్రేమన్నది తెలియనిదా..!

జ్ఞానకాంతి పంచుతున్న చరణాలను ఆపలేము..!


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics