అరకన్నుల
అరకన్నుల
కురుస్తున్న బ్రహ్మకాంతి..ఆరగించు అరకన్నుల..!
పరమశ్వాస దారిలోన..పరవశించు అరకన్నుల..!
చదువులెన్ని చదివినా..అసలుచదువు శ్వాసవిద్య..
సాక్షియగుచు నిన్ను నీవు..నిలవరించు అరకన్నుల..!
చేయు పనిని ఇష్టంగా..చేస్తుంటే ధ్యానమౌను..
కర్మలన్ని భస్మమగును..గౌరవించు అరకన్నుల..!
గగనకుసుమ మేదిలేదు..అన్ని సులభ సాధ్యములే..
శ్రద్ధపెట్టి కదలకుండ..పరిమళించు అరకన్నుల..!
అందమైన పసిడిమేడ..కట్టి పట్టుకెళతావా..
రుచులవాడ దాటేందుకు..కలవరించు అరకన్నుల..!
