అనురాగపు
అనురాగపు
అనురాగపు కోవెలలో..ఇరుమనసులు ఏకమౌను..!
స్వచ్ఛమైన స్నేహంలో..కలలన్నీ సఫలమౌను..!
ఇరువురిలో అధికులెవరు..లేరన్నది తెలిసేనా..
సంసారపు లోగిలిలో..ఆనందమె భాగ్యమౌను..!
రెక్కలొచ్చె పిల్లపక్షు..లెగిరిపోతె చింత ఏల..
వారి క్షేమమాశిస్తే..నిజస్వర్గమె సొంతమౌను..!
చెలి అలుకలు తీర్చినంత..ప్రేమ పరిమళించునుగా..
చేయిచేయి కలిసినంత..సమయాలే సరసమౌను..!
ఆరోగ్యం ఉందెక్కడ..శ్రమశక్తికి దాసోహం..
ఇష్టముగా కష్టపడిన..ప్రతినిముషం సౌఖ్యమౌను..!
వయసుమీద పడుతోందని..భావిస్తే నరకం కద..
చిరునవ్వుల వెన్నెలతో..సంపదలే నిత్యమౌను..
