STORYMIRROR

Midhun babu

Classics Inspirational Others

4  

Midhun babu

Classics Inspirational Others

ప్రత్యేకత

ప్రత్యేకత

1 min
9

ఓర్వలేనితనం అనే..మిత్రునిదే ప్రత్యేకత..! 

ప్రశంసించు గుణంలేని..చిత్తునిదే ప్రత్యేకత..! 


గొప్పతనం ఎంతున్నా..ఎవరిగొప్ప వారిదిలే.. 

అక్షరాల జగడమాడు..విజ్ఞునిదే ప్రత్యేకత..! 


ఎవరికెవరు నేర్పాలట..ప్రేమయుద్ధ రహస్యాలు.. 

ఉన్మత్తత సొంతమైన..మూఢునిదే ప్రత్యేకత..! 


సాధికారతేమున్నది..చెలిమిగదిని చేరలేక.. 

తనమాటే నెగ్గాలను..మూర్ఖునిదే ప్రత్యేకత..! 


ఎవరైనా వ్రాయవచ్చు..ఏ ప్రక్రియలోనైనా.. 

గుట్టుపట్టు పట్టలేని..ధీరునిదే ప్రత్యేకత..! 


మనసు విప్పి చెప్పాలను..ఆశచూడ అత్యాశే.. 

ఒక వసంత కోకిలైన..సౌమ్యునిదే ప్రత్యేకత..! 


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics