జీవితం
జీవితం
నిన్ను నీవు చంపుకునే..ఖర్మమేమి జీవితం..!?
ఆశపడుతు ఉరుకులాడు..విషయమేమి జీవితం..!?
సమర్థించుకునే పనికి..స్వస్థి ఎపుడు చెబుతావు..
అబద్ధాల రగ్గు పట్ల..మోహమేమి జీవితం..!?
మనశ్శాంతి సందేశం..నిండి ఉంది అంతటా..
అందుకోను చేతకాని..భాగ్యమేమి జీవితం..!?
ఊపిరింటి సహననిధికి..కోపమనే నిప్పేల..
నిలుపుకోను వల్లకాని..నరకమేమి జీవితం..!?
అనురాగపు రాశిలాగ..అల్లుకోను అహమేల..
గుప్పెడంత గుండె పిండు..చిత్రమేమి జీవితం..!?
