మనుషుల్లో మనిషి
మనుషుల్లో మనిషి
మనుషుల్లో మనసులను వెతుక్కుంటూ బయలుదేరాను
కొన్ని పరిచయమైనవి కొన్ని నన్ను పలకరించనివి
మొదట అంతా బావుంది అనుకున్న నేను
విడమరచి విషయాలన్నీ వివరించడం మొదలెట్టావు నీవు
వనంలో సంతోషంగా తిరిగే సీతాకోకను
ముళ్ల లాంటి గూటిలోకి మరల తిరిగి పంపించావు
భేషజాలు లేని మా మదిలో
కులమంటూ మతమంటూ వేరుచేస్తున్నావు
వీలైతే మమతను పంచమని అన్ని గ్రంధాలసారమైనా
నీ పరిధిని దాటి నువ్వువెళ్లలేకపోతున్నావు
రాజకీయ రంగు పులుముకున్న నీ కలం
ఎర్రటి రక్తాన్ని చిందే రచనలు చేయాలి
నీలా నీస్వార్ధపు రంగే కనబడుతోంది
ఒక్కొక్క ముళ్లతుంపను తెంచి నా దారిన నేను వెళదామనుకుంటాను
మొత్తం ముళ్లమొక్కలునే నాటుతున్నావు నీవు
విప్లవం అంటే కడుపునిండా తిని కుళ్లురాతలు రాయడం కాదు
బ్రతుకుతెరువుల కోసం దశాబ్దాలుగా పోరాడటం
నీకెందుకు ఇన్ని ఫలాలు అని అడుగు తాను నేను
మేం తెచ్చుకున్న హక్కు అంటావు
నీ వాళ్లను ఎంతవరకూ ఎడ్యుకేట్ చేసేవు అంటాను నేను
నీమీద ద్వేషం నింపుతున్నాను అంటావు
హక్కులేనా నీ జాతిని ఉద్ధరించే బాధ్యత లేదా అంటాను
కులాలంటూ విడదీసింది మీరేగా అంటావు
అందుకేగా 75 సంవత్సరాల నించీ తింటున్నావు అంటాను నేను
అడుగుతాను నేను
నిజాన్నే అడుగుతాను నేను
కాదంటావా చెప్పు
ఇంటికి 4 ఉద్యోగాలు 6 పెన్షన్ లతో నువ్వు బావున్నావా
మీ పేటలో కి కూడా తొంగిచూడవా
వాళ్లకు కనీసం చిన్న ఆర్ధిక సాయం చేయవా
నాలుగు అక్షరం ముక్కలు నేర్పవా
నువ్వేం చేస్తున్నావు అని అడుగుతావా?
నీవు ద్వేషం నింపేచోట మమతను పంచుతున్నాను
పేదలుపేదలుగా వుండి పోకూడదని
ఆ పేదరికంలో మేం ఉండి పోకూడదని కోరుకుంటున్నాను
