భయపడకు... బాధ్యతగా ఉండు!
భయపడకు... బాధ్యతగా ఉండు!


చేయి చేయి కలపకుండానే;
సమైక్యభావం తెలుపుదాం!
ఒకరిని ఒకరు కలవకుండానే;
అందరమొకటిగా బలపడదాం!
పోలీస్ మనని బాదకుండానే;
ఇంటిపట్టున నిలబడదాం!
ఇటలీ మాదిరి కాకుండానే;
కరోనాని తరిమికొడదాం!
జోష్యం కాదిది విశ్వాసం;
నిలవగలం, మనం గెలవగలం!
హాస్యం కాదిది వాస్తవం;
చికెన్పాక్స్, పోలియోలను తిప్పికొట్టాం!
"పదండి ముందుకు, పదండి దూసుకు!"
అన్న మాటలకు కాదిది సమయం!
"చెప్పే వరకు, బయటకు రాకు!"
ఇదియే ప్రస్తుత విశ్వ వైద్య సూత్రం!
కుంగిపోకు నువు ధైర్యంగుండు;
కనిపెడతాంలే దీనికి మందు!
ప్రభుత్వ సూచన పాటిస్తుండు;
అంతా మారును మునుముందు!