సహస్ర కిరణాలతో
సహస్ర కిరణాలతో
సహస్ర కిరణాల ముఖముతో సూర్యుడు
నిత్యము సత్యాన్ని బోధిస్తున్నాడు
పడమటి చెట్టు కొయ్యకు బంధిస్తే
పదునైన చీకట్ల ముల్లులను బిగించే..
నల్లగా నవ్వింది అజ్ఞానపు జాడ్యం
అహంతో మతి ప్రేమించింది రాత్రిని
బాధపడిపోయింది పగలు కాంతి
అదిక్రమించలేదు ఆ రేయంతా ఓపిగ్గా..
తూర్పున మెరిసింద పచ్చని చుక్క
కరుణకు మరో రూపం గా నిలుస్తూ
కిరణాల వెలుగును ప్రసరిస్తూ
నిలువెల్లా పసిడితనాన్ని చూపిస్తుంది..
చల్లగా విసిరింది ఒక గాలి
చిరునవ్వుల అవతారమెత్తి
బాట గట్టున వికసించింది కొండమల్లె
గొంతులో రాగాలను పలికించేందుకు..
పునరుత్థానం కలిగే మనిషికి
అరుణోదయపు కుదుళ్ళను చూస్తుంటే
నోట్లో వాణి స్మరిస్తుంది
అమృత వర్షము లాంటి కిరణాలను..
ఆకాశపు పందిరి కింద వాలింది
వర్ణహంకారాల ఎండ దెబ్బలకు
అజ్ఞాన తిమిరాల అరుపుల మధ్య
విజ్ఞానపు సూర్యోదయం వికసించింది
విత్తనాన్ని మట్టిలో దాచి పెడితే
వృక్షమై మేల్కొని వొచ్చింది
అది ప్రచండ భానుని సృష్టి కదా
ఆ తేజో రూపానికి వికసించెను భూమాత..
