సత్య వాణి
సత్య వాణి
ధ్యాసనిలుపు..బలమునిచ్చు మౌనవాణి..!
జగమంతా శాంతి నింపు..జ్ఞానమిచ్చు మౌనవాణి..!
అక్షరాల నడుమ వెలుగు..పరిమళమే కురిసేనా..
అంతరంగ దీపాలకు..ప్రాణమిచ్చు నాదవాణి..!
ప్రతిహృదయపు కోవెలలో..కొలువుతీరి వెలిగేనా..
పరమాద్భుత చైతన్యపు..భాగ్యమిచ్చు హంసవాణి..!
కణకణమును అమృతమధుర..రసవీణగ మలచేనా..
సరసరాగ సుధాభరిత..గంధమిచ్చు భావవాణి..!
ప్రతిఊహను ప్రకటించగ..ఎదలోయల నిండేనా..
తనచూపుల మందహాస..కవనమిచ్చు నిత్యవాణి..!
పదపదమున తన పదముల..సోయగాలు కూర్చేనా..
ప్రతిపదార్థ తంత్రులకే..ప్రణవమిచ్చు విమలవాణి..
