STORYMIRROR

Midhun babu

Classics Inspirational Others

4  

Midhun babu

Classics Inspirational Others

గురువు

గురువు

1 min
10

బుద్ధిలేని నా మనసుకు..తానేగా గురువు..!

అనుభవాల ఈ బడిలో..క్షణమేగా గురువు..!


ఆశపడే ముచ్చటలే..అగచాట్లుగ మిగులు..

పలుకు ప్రేమ సరిగమలకు..చినుకేగా గురువు..!


వింతగాలి చిరుహాసం..ఆలకింతు రెవరు..

శ్వాసలేలు మౌనానికి..మెఱుపేగా గురువు..!


భాషలేని వేదమేదొ..నదిలాగా మదిని..

చెలి మోహన రాగానికి..రుతువేగా గురువు..!


చూచు దృష్టి బాగుందా..జగము శాంతి వనము.. 

నిదానముగ గమనిస్తే..లఘువేగా గురువు..!


నేర్పువారు నేర్పరులే..పరులెవ్వరు లేరు..

నేర్చుకునే అభిలాషకు..ఓర్పేగా గురువు..!


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics