మంగళ తోరణం
మంగళ తోరణం
తెలుగు అక్షరాల మంగళ తోరణం
అల్లుతుంటే విరజిమ్ముతుంది ఆంధ్ర భాషా పరిమళం
ఆస్వాదిస్తే అమృతంకన్న రుచికరం
అందుకే అలరారుతోంది విశ్వవ్యాప్తం
కవి చేతులతో లిఖించే అక్షర సాహిత్యం
అచ్చులు హల్లుల రూపాలలో అందమైన పూలవనం
పద, వాక్య ప్రయోగాలు పలికించే భాషా సౌందర్యం
వ్యాకరణ చందస్సులు నర్తించే శివతాండవం
సుస్వరాగాల గొంతులో సరిగమల సంగీతం
పురాణ ఇతిహాసాలు బోధించిన విలువల ఆంతర్యం
భగవద్గీత తెలిపిన జీవిత సత్యం
గ్రంధోపనిషత్తులు వివరించిన సృష్టి రహస్యం
తీయ తీయని మాటల తెలుగు భాష గొప్పదనం
మరిచిపోతున్నారు మాతృభాష ప్రాముఖ్యం
మమ్మీ డాడీ అంటే ఎగిరి గంతేస్తుంది తల్లిదండ్రుల మురిపెం
మాయమైపోతున్నాయి అమ్మా ,నాన్న అనే అందమైన పదం
విలువలు విజ్ఞానం పంచే తెలుగు భాషా సాహిత్యం
విశ్వవ్యాప్తంగా వెలుగొందుతోంది ఆంధ్ర భాష ఔన్నత్యం
గుర్తించాలి తెలుగువారు మాతృభాషా ప్రాశస్త్యం!
అందించాలి భవిష్యత్తు తరాలకు తెలుగు భాష
సుగంధం!!
