STORYMIRROR

Midhun babu

Classics Inspirational Others

4  

Midhun babu

Classics Inspirational Others

మహిళ మణి

మహిళ మణి

1 min
12


పురుషుని జీవితానికి

పరిపూర్ణం మహిళ

మగువ జన్మకు దైవమిచ్చిన

అపురూపమైన కానుక

మాతృత్వం,అమ్మా.అన్న పిలపే

స్త్రీమూర్తికి తరగని నిధి


తొలకరి జల్లుతో పులకరించిన

నేల తల్లి పురుషుని ఒడిలోన

పరవశించిన తరుణాన

భూమత హరిత వర్ణంతో

పురుడు పోసుకుంటుంది


కులసతి తన కన్నెత్వాన్ని

పూజా కుసుమంగా మగనికి

అర్పించిన వేళ మాతృత్వానికి నాంది

అదే ఈ జాగతికి పునాది

మగనాలికి ఒడి నింపే సౌభాగ్యం


తన గర్భగుడిలో దినమొక

రకంగా ఆకారం దిద్దుతు

మాయపొర చాటున పదిలంగా

దాచి పురిటినొప్పులకోర్చి

మరణం అంచును తాకి

పుడమి తల్లి ఒడిలో జార

విడిచే ఘనత స్త్రీమూర్తిది


సహనంలో భూజాత పడతి

ఒద్దికలో మరో సీత తరుణి

మహిలో మొదటి స్థానం మగువ

అవనికి అందం అతివ

ఆ విధాత అదనంగా

నారి లోకానికి ఇచ్చిన వరం

పవిత్ర గర్భాలయం


మగాడెప్పుడు ఒంటరి అంకె లాంటి వాడే

అతని పక్కన స్త్రీ తల్లిగా చెల్లిగా

ఆలిగా,తనయగా

ఉంటేనే పురుషునికి నిండుదనం

మహిళ లేని మగవారి జీవితం

సూర్యుడు లేని ఆకాశం...


      


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics