జీవన ప్రయాణం
జీవన ప్రయాణం
ఎన్నో సాధించామని సంబరపడే మనిషీ
ద్వేషంతో నువ్వొకవృత్తంలో ఇమిడిపోయావని తెలుసుకో
ఇంటర్ సెక్ట్ అయ్యే కొద్దిమంది బాహువుల్లో ఇరుక్కుపోయావు
వారు భుజాన వేసుకుని ఊరేగినంతకాలం
నీవు ఎత్తులో వున్నావని భ్రమసిపోతావు
నీ వారికి ఏదో చేసేద్దామని కొద్దికొద్దిగా నీకు తెలీకుండా బంధాలను కలుషితం చేస్తున్నావు
మానవత్వాన్ని మమతను విడచి క్రూరమృగంలా వాడియైన గోళ్లతో గుచ్చుతున్నావు
స్వచ్ఝమైనదేదో తుచ్ఛమైనదేదో తెలుసుకో
కళ్లకు లవ్ లెన్స్ పెట్టుకొని చుట్టూచూడు
నీకు జవాబు తప్పక దొరుకుతుంది.
