అణచివేత
అణచివేత
ఎందరి త్యాగఫలమో ఈ ఏడు పదుల స్వాతంత్య్రం
అభివృద్ధి అంటూ ఆర్థికంగా పురోగమనము
ఆకాశాన్ని తాకే భవనాలు
కాలంతో పోటీ పడే టెక్నాలజీ
అయినా బిక్షగాళ్ళతో,
పేదవాళ్ళతో,
ఆకలి చావులతో,
తప్పని తిరోగమనము
రాజులు పోయారు
రాచరికాలు పోయాయి
కానీ
పేదవాడి ఆకలి చావులు మారలేదు...
రైతన్న గుండెకోత మారలేదు
రాక్షసుల నీచకార్యాలు ఆగలేదు
ఆధునిక యుగం అంటూ...
మార్పు ఎక్కడ?
ప్రగతి ఎక్కడ?
దేశ ప్రగతి ఆకలి చావుల్లోనా?
అనాథల వీథి బ్రతుకుల్లోనా?
లేక
బడాబాబుల పొట్టలోనా?
అనునిత్యం జరుగుతున్న అన్యాయం
పేదవాడిని ఆదుకోని ప్రయత్నం...
ఆకలికి దక్కని ఆహారం...
దేశం ప్రగతి పథంలో దూసుకుపోతుంది...
ఆకలి చావులను
అనాథ జీవులను
ఉక్కుపాదంతో అణచివేస్తూ.
