వలసల బ్రతుకులు
వలసల బ్రతుకులు
పట్నమొచ్చినామ్ మేము పట్నమొచ్చినామ్ బ్రతుకు తెరువు కోసమని పట్నమొచ్చినామ్ /పట్న /
సొంత ఊరు వదలి మేము - చుట్టాలనొదలి మేము /వయసొచ్చిన వారినొదలి వయసైన వారినొదలి /పట్న /
కొరోనా భయంతోనే కఠినరాయి గుండెతోనే మారాజులు కొందరేమో మెడబెట్టి గెంటినారు /పట్న /
దళారీల మాటలపై నమ్మకాలు వదలి మేము సొంతూళ్లకు బయలుదేరి నడిరోడ్డున పడ్డాము /పట్న /
మనసున్న మారాజులు మమ్మల్ని చేరదీసి మనిషికంతా కూడుబెట్టి మనసుకంతా దగ్గరాయె /పట్న /
బుద్ధి వచ్చెనన్న మాకు బుద్ధి వచ్చెను సొంత ఊరు విడిచి ఎక్కడకు వెళ్లరాదని /పట్న /