Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win
Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win

Malleswari Kolla

Drama Classics Others

4  

Malleswari Kolla

Drama Classics Others

కలయిక

కలయిక

1 min
165


కలయిక ఒక అధ్బుతం....

ఇద్దరు కలవటం ఎంత తేలికో...

అంత కష్టం కూడా...!!

అందరు అందరితో కలవలేరు...!!

నేను ఒకరితో కలవాలనుకుంటే

ఒకరు నాతో కలవాలనుకుంటారు...!!

అభిప్రాయలు, అహంభావం, తొడుగులు, సిద్ధాంతాలు, మనుష్యులు, కులాలు, మతాలు, సరిహద్దులు....

ఇలా కలవనీయనిది ఏదైనా దుర్మార్గమే...!!

కలవటమా కలవకపోవటమా అన్నదే ముఖ్యం...!!

కలిపేది ఏదైనా దాన్ని నేను గౌరవిస్తాను...!!

తరగతి గదో, దేవుని గుడో, కళాశాల మైదానమో, పండగో, పబ్బమో, పెల్లిపందిరో....

ఇలా కలిపేది ఏదైనా అది సన్మార్గమే...!!

ఇద్దరు కలిసి కరిగిపోవటం కన్నా గొప్ప అనుభూతేముంది జీవితంలో....

ఇద్దర్ని కలపటం కన్నా గొప్ప మహత్కార్యం ఏముంది ఈ ప్రపంచంలో...!!

స్నేహంలో ప్రేమ కలవటం...

పాటలో ప్రాణం కలవటం...

కవితలో కరుణ కలవటం...

నేలలో వాన కలవటం...

మట్టిలో విత్తు కలవటం...

ఇలా ఏవి ఎలా కలిశాయన్నది కాదు...

కలవటమే అన్నిటికన్నా ముఖ్యం...!!



Rate this content
Log in

More telugu poem from Malleswari Kolla

Similar telugu poem from Drama