మహమ్మారితో ఆటలొద్దు
మహమ్మారితో ఆటలొద్దు


వారు వీరు ఎవరూ లేరు ,ఎక్కడివారక్కడ ఉన్నారు. పేద లేడు,ధనికుడు లేడు,అందరమొకటే అంటున్నారు. దైవం లేదు ,ధైర్యం లేదు ,వైద్యుడే మనకు దేవుడయ్యాడు. కులమూ లేదు ,మతమూ లేదు,చిందరవందర బ్రతుకే లేదు. అన్నిటికన్నా అందరిముందర ఉందిర కదరా కరోనా ఇప్పటికైనా కన్నులు తెరవర,వలయం ఉందిర నిలయాన అందని ద్రాక్ష ల ఉందిర కదరా ,వైద్యం లేదీ సమయాన మంత్రం,తంత్రం,యంత్రం లేని మహమ్మారి ఈ కరోనా. ప్రాణాలే ప్రీతి అన్న ,ప్రాణ భీతి పెరుగుతున్న గడపదాటి పోకురన్న వినరా నాన్నా. ఉన్న ఊరే నీ ఊరు, చిందించకు కన్నీరు ఎక్కడున్న నీ వారు ,నీ క్షేమమే కోరుతారు. కల్ల ముందెే కూలుతున్న ప్రాణాలని చూడు కనిపించని క్రిమితోనే మొదలెట్టు నీ పోరు. ఇట్లుః మహేష్ కృష్ణ