నాప్రేమగాధ
నాప్రేమగాధ
1 min
821
గుండె పిండేసి పోయావు,
నేను వద్దంటూ వదిలావు,
ప్రాణమా అనుమానమా?
పసుపు తాడు కై పరుగెత్తావు
ఉరి తాడు నాకే బిగించావు.
నీతో గడిపిన కాలాన్నే
గురుతు గా మిగిలించావు.
నువ్వు పలికిన మాటలే
నీకు గుర్తున్న చాలులే.
నువ్వు పంచిన గ్నాపకాలే
కడలిలోనే కలిసెలే.
ఎన్నో కనుమరుగయ్యాయే
నువ్వు నాతో ఉంటే.
అన్నీ గురుతొస్తున్నాయే
నువ్వు వెళిపోతుంటే.
నీకై నే కన్న కలలన్నీ
కన్నీరై జారిపోయెలే.
ఎడారిలోనే తిరుగుతున్నా
గమ్యాన్నే నేనెరుగక.
రెప్పనైనా మూయకున్నా
కళ్లలో నిను కదపక.
తిరిగిరావని తెలిసినా
మళ్లీ నిను ప్రేమించనా.
మనసు ముక్కలు చేసుకున్నా
మారదే మది తెలుసునా.
తెలుసుకో నా గుండె భాధ
ఇదిగొ ఇదె నా ప్రేమ గాధ.