STORYMIRROR

Mahesh krishna

Romance

4  

Mahesh krishna

Romance

కోయిల

కోయిల

1 min
804

అల్లరే నిన్ను చూసినే నేర్చినానే

అమ్మనే నీలో చూసినానులే.

ఎప్పుడో రాసుకున్న కవితలే

ఇప్పుడే నాకు గుర్తుకొచ్చెలే.

ఎప్పుడూ నాకు నన్నెచూపించినా

అద్దమే,నేడు నిన్ను చూపెనే.

సంబరం నాలో మొట్టమొదటిసారిగా

అంబరాన్నే తాకుతున్నదే...

               


దిక్కులే దిక్కుతోచకున్నవే,నువ్వు దిక్కులే మారుతుంటే

చిలకలే పలికినట్టుంటదే ,నువ్వట్ట మాట్లాడుతుంటే.

నీచిన్ని పెదవి కందిపోతుంటదే నీకుగాని కోపమొస్తే

కొంటె కళ్లు నిప్పు జల్లుతుంటయే,ఒంటి కాలిమీద నువ్వుంటే.

ఆజాబిలమ్మ మురిసిపోదా...తను నేల మీద నీలా ఉంటే.

              


నీ చిరునవ్వు కోసమే మరుసార్లు జన్మిస్తా

నీ కంటిచూపు తాకగా తొలకరై పులకిస్తా.

మల్లెల, వెన్నెల రూపమా,ఈ మాయ ఇదివరకెరుగనమ్మా

కోటికాంతుల దీపమా,ఈనాటి వెన్నెల నీవరమా.

కోవెల నేనమ్మా వాలే కోయిల నువ్వమ్మా

పాటే నీవమ్మా ,పాటకు పదమే నేనమ్మా.....



Rate this content
Log in

Similar telugu poem from Romance