STORYMIRROR

murali sudha

Abstract Tragedy

3  

murali sudha

Abstract Tragedy

అందులో

అందులో

1 min
168


వదులుకున్న బంధాల గుర్తులున్నాయి

చెప్పా పెట్టకుండా చాప చుట్టేసిన శ్వాసతో కలసి


కొన్ని ఆశల ప్రతిబింబాలు ఉన్నాయి

నూలుపోగునీ మోయలేనని మొరాయిస్తున్న శిథిల దేహంలో చిక్కి


కొన్ని యుద్దాల గుర్తులు ఉన్నాయి

రాజీనామా తీసుకున్న అవయవాల ఆగిన కదలికల్లో


అదో ఆరడుగుల రాజ్యం...

ఏక ఛత్రాధిపత్యమే అక్కడ...

నువ్వే రాజు... నువ్వే సైన్యం...


ఇంకెందుకు దిగులు...

ఫిదా అయిపో సుఖానికి...

ఎంతైనా చివరి సుఖం .... చివరి సుఖమే........  


సుధామురళి


Rate this content
Log in

Similar telugu poem from Abstract