బలిమి
బలిమి
బలిమి (పద్య కవిత )
బంధుమిత్రులు మనకిడు బలిమినెపుడు
కలిసి మెలిసి బ్రతికినచో కలుగు కలిమి
ఆటలాడుచు పిల్లలు హాయిగాను
తల్లితండ్రులు పిల్లలు తన్మయముగ
గాంచుచుండగా చిత్రమున్ కలకలనుచు
చూచువారల మదినిండి సొక్కుచుంద్రు.
జగతి యందున సాంసార చక్రమెపుడు
సాగుచుండు నీరీతిగ సంతసముగ
నాటిదినములలో నిల్చె నమ్మకంబు
భయము బాపెనా కాలంపు బంధుప్రేమ
బాధలన్ బొంద కూడుచు బంధుగణము
చేరి యొసగంగ నోదార్పు చింతదీరు
కరము కరమును బట్టుచు కలిసియుండ
భారమంతయు తొల్గును భవ్యమైన
జీవితంబున కల్గును శ్రేయ మెపుడు.
