STORYMIRROR

Gayatri Tokachichu

Inspirational

4  

Gayatri Tokachichu

Inspirational

తరువువోలె

తరువువోలె

1 min
232

*తరువువోలె*


తేటగీతులు 


నీరు పోసిన చాలును నీడ నిడుచు

ప్రాణవాయువు నొసగును పాదపములు

ఫలము లెన్నియో కురిపించి బ్రతుకు నిలిపి

ధరణి రక్షణ చేపట్టు తరువులెపుడు.//


పరుల కుపకారమును జేసి ప్రజలు నడిచి

సాధు గుణముతో మేలును సలుపుచుండ

దైవగణములు మురియుచు దరికి చేర్చ 

పుణ్య ఫలములు దక్కునీ పుడమి యందు.//



Rate this content
Log in

Similar telugu poem from Inspirational