ప్రాతఃస్మరణీయులు
ప్రాతఃస్మరణీయులు


ప౹౹
తల్లి తండ్రులే కదా కారణం పురోగతికి
మళ్ళీ వారే కదా తార్కాణం ఆ ప్రగతికి ౹2౹
చ౹౹
అహర్నిశలూ బిడ్డల సౌఖ్యమే ధ్యేయం
ఏ ప్రశ్నలూ లేక ఎంతో చేస్తారే వ్యయం ౹2౹
సొంతమనేది లేకా చేయుటే పరమార్థం
ఎంతచేసినా వారి కష్ఠంలో లేదే స్వార్థం ౹ప౹
చ౹౹
పంచప్రాణాలు ఆ కనిపెంచిన వారి మీదే
అంచనాలకూ మించినా అపురూపమదే ౹2౹
జన్మకారకులనూ సదా గౌరవించాల్సిందే
ధర్మభోథకులను మరి పూజాంచాల్సిందే ౹ప౹
చ౹౹
ఫాదర్స్ డే మదర్స్ డే అనేది ఒక రోజేగా
ఆదర్శంగా నిలిచినా తలచేది ఆ రోజేనా ౹2౹
వారు మనకి నిత్య స్మరణీయులు కాదా
వారు అందరికి ప్రాతఃస్మరణీయులే కదా ౹ప౹