సాధన
సాధన
సాధన
సాధనతో కార్యం సానుకూలమవుతుంది
సమసమాజ నిర్మాణమే సాధ్యమవుతుంది
నదులలో కాలుష్యం నాశమవుతుంది
హృదిలోని మాలిన్యం తొలగిపోతుంది
గాలిలో తేమ శాతం పెరిగిపోతుంది
నీలోని ప్రేమగుణం నిశ్చలమవుతుంది
తరువులు నాటితే పుడమి పులకిస్తుంది
చిరునవ్వుతో స్నేహం చిగురులు వేస్తుంది
పేద వానికి సాయం పెద్దరికమవుతుంది
నాది, నేనను భావన భస్మమవుతుంది
జ్ఞాన సముపార్జన జాతికి వెలుగిస్తుంది
మానసిక శాంతితో బుద్ది వికసిస్తుంది
పరుల మేలును కోరితే భావి పలకరిస్తుంది
పారమార్థిక చింతన పరమాత్మను చేరుస్తుంది
నిరంతర సాధన నిన్ను నిలబెడుతుంది
చరించవోయి నిన్ను జగతి స్మరిస్తుంది.
