స్మృతులు
స్మృతులు
గడచిపోయిన స్మృతులు మళ్ళీ
నీ సమక్షంలో మేల్కొంటాయి!
కాలం కడలిలో అలలు నీ అల్లరితో దోబూచులాడతాయి!
నీ తీయని ముద్దు నా పెదాలు తడుపుతుంది!
నీ రూపం నాలో విహంగమై వాలుతుంది!
నిన్ను చూసే క్షణం నీనేన్నా అనే భ్రమను రేపుతుంది!
నీ తలపుల నొప్పితో విలవిలలాడిన నా గుండెను
నీచేత అదుముకుంటాను!
నేను కళ్ళు దించుకొని నీ నుండి వీడ్కోలు తీసుకుంటాను!
నన్ను దుఃఖ సముద్రంలో ఒంటరిగా వదిలేసివెళ్లిపోతావు బంగారం !!!!!

