హరితహారం
హరితహారం
బాలపంచపదులు
హరితహారం
మొక్కలెన్నియో నాటండి జనులారా!
నీరుతెచ్చి పోయండి నెలతలారా!
పచ్చదనము పెంచండి పౌరులారా!
మంచిపని చేయండి మనుజులారా!
జీవమొసగండి పుడమికి జయా!
ప్రాణవాయువు నొసగు పాదపాలు
ఫలరసాల నొసగు పాదపాలు
వరదల నాపుచుండు పాదపాలు
వానలు కురిపించునీ పాదపాలు
వసుధను రక్షించు నెపుడు జయా!
స్వచ్ఛముగ వీచునీ సమీరములు
చక్కగా తిరుగునారు ఋతువులు
కలుగు ప్రజకు నాయురారోగ్యాలు
పెరుగు చుండగ సౌఖ్యసంపదలు
హరితహారము హాయి హాయి జయా!//
