కొడకా..
కొడకా..
పుణ్య దేశ రైతు బానిస కాదురా
పొట్టకూడు నింపు పొలాల రాజురా
పల్లె పల్లెకు జానపదులద్దు జానపదిరా
ప్రకృతితో నిత్యం పోరాడు యోధుడురా
పిడి బిగించి పగ్గంపట్టి పొలం దున్నేవాడురా
పాతాళ గంగతో పట్టుసాధించు హాలకుడురా
ప్రాణాలు అరచేతబట్టి ప్రాణం పోయు రేడురా
ప్రాపంచిక సుఖ మెరగని పంటల పసి పాపరా
ప్రపంచానికే ఆకలి దప్పులు తీర్చు పాలకుడురా
ప్రజా*పాలక గుండెల్లో నిలిచే నిత్యసత్యవాదిరా
పద గొర్రు కట్టి పుడమి తల్లికి గోరుముద్ద పెట్టరా
పాకుడు పట్టిన మదిపెళ్ళల పరిహాసం దులపరా
పవిత్ర భారతమాత చంద్రికల పేగు ఘోష వినరా
పశ్చిమ ఋతుపవన చినుకు వరదై నీకై రాలెరా..!
